![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్తగా మారుతుంది. కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వారు ఆడుతూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నారు. శని, ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే నామినేషన్లలో హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. గతవారం 2.0 గ్రాంఢ్ ఎంట్రీ లో వచ్చిన కొత్త కంటెస్టెంట్స్ అశ్విని, భోలే షావలికి నామినేషన్లు ఎక్కువగా పడ్డాయి. నామినేషన్లు ఎక్కువగా పడేసరికి ఎంతో కూల్‌గా వుండే భోలే షావలిలోని మరో వ్యక్తి బయటకు వచ్చాడు. తనలోని బాధను మర్చిపోతూనే.. తనకు నామినేషన్స్ పడుతున్న ప్రతీ సారి తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ కామెడీ చూస్తున్న ప్రేక్షకులు తన బాడీ ల్యాంగ్వేజ్ మరియు తన మాటతీరు అచ్చం రాకేష్ మాస్టర్‌ల వున్నాయని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే.. రాకేష్ మాస్టర్ కూడా తనలోని నటుడ్ని అవసరానికి తగ్గట్టుగా బయటకు తీసుకోస్తూ వుండేవారు.
కుండ పగులగొట్టి తమ నామినేషన్ ఎవరికో తెలియజేయాలని బిగ్ బాస్ కోరగా.. ఒక్కో హౌజ్ మేట్ తమ నామినేషన్లని కొనసాగించారు. మొదట ఆట సందీప్ ని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. రెండవ నామినేషన్ గా టేస్టీ తేజని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత అమర్ దీప్ భోలే శావలిని నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్యలో గొడవ అవుతున్నప్పుడు మధ్యలో రాకూడదని భోలే షావలిని అమర్ దీప్ నామినేట్ చేశాడు. నోరు వదిలేయకుండా ఉంటారని నామినేట్ చేస్తున్నానని అమర్ దీప్ అన్నాడు. అశ్విని శ్రీని నామినేట్ చేశాడు అమర్ దీప్. " ఏముందిలేండి , అయిదు వారాలు ఉన్నారు కదా అని మీరు నన్ను నామినేట్ చేశారు" అది నాకు నచ్చలేదు దానికే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని అశ్వినిశ్రీతో అమర్ దీప్ అన్నాడు. మీరు ఇలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎదుటివాళ్ళు హర్ట్ అవుతారు. మీరు ముత్యాల్లాగా మాట్లాడుతున్నారని అశ్వినిశ్రీ అంది.
అంబటి అర్జున్ భోలే షావలిని నామినేట్ చేశాడు. హౌస్ లోకి ఎవరైన ఆట ఆడి గెలవడానికే వస్తారు. మీరు మాత్రం ఆట ఆడకుండా హౌస్‌లో ఉంటే చాలు అని వచ్చారని అనిపిస్తోంది. అదే మీ ఫీలింగ్ అయితే ఈ ఇంట్లో ఉండటం కంటే బయటకు పోవడమే కరెక్ట్ అని నామినేట్ చేశాడు అంబటి అర్జున్. ఆ తర్వాత ఆట సందీప్, భోలే షావలి, పూజా మూర్తి ఇలా దాదాపు అయిదుగురు హౌజ్ మేట్స్ భోలే షావలిని నామినేట్ చేసారు. ఇక అందరిని అమ్మ అని పిలిచే భోలే షావలికి ఒక్కసారిగా తనలోని కూల్ పోయింది. మీకు నచ్చినట్టు మీరున్నట్టే నాకు నచ్చినట్టు నేనుంటా కదా అని భోలే భోలే షావలి డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ మాదిరి మాట్లాడాడు. భోలే షావలి మాటతీరు, ప్రవర్తన బట్టి రాకేష్ మాస్టరే ఇలా వచ్చాడా అనేలా ఉన్నాడు. ఇక నామినేషన్ల ప్రక్రియ మరో రోజు కొనసాగుతుందని బిగ్ బాస్ చూపించాడు. ఇందులో శోభా శెట్టి మోనితలా మారిందని భోలే షావలి అనగా.. నా నిజస్వరూపాన్ని ఇంకా నువ్వు చూడలేదంటూ శోభా శెట్టి అంటుంది. ఇప్పుడు అది మరింత హైప్ ని క్రియేట్ చేస్తుంది.
![]() |
![]() |